
ప్రత్యర్థులకు బ్యాట్ తోనే సమాధానమిచ్చే సచిన్ టెండూల్కర్(Tendulkar).. తొలి టూర్లోనే ఆవేశపడ్డాడట. దీంతో అతణ్ని బెదిరించినట్లు రవిశాస్త్రి చెప్పాడు. ‘1991-92లో సిడ్నీ క్రికెడ్ గ్రౌండ్ లో సెంచరీ చేశా.. సచిన్ అప్పుడే బ్యాటింగ్ కు వచ్చాడు.. స్టీవ్ వా, మార్క్ వా స్లెడ్జింగ్ చేస్తున్నారు.. 12వ ప్లేయర్ విట్నీ సైతం మాటల దాడి చేస్తూనే ఉన్నాడు.. నువ్వు క్రీజులోకి రా, తల పగలగొడతా అంటూ నన్ను అలన్ బోర్డర్ తిడుతున్నాడు.. దీంతో సచిన్ ఆవేశంతో ఏదో ఒకటి చేద్దామన్నాడు.. నోర్మూసుకుని నీ బ్యాట్ తోనే సమాధానమివ్వాలని వార్నింగ్ ఇచ్చా..’ అని నాటి రోజుల్ని శాస్త్రి గుర్తు చేసుకున్నాడు.