
పంట నష్టం పరిశీలనకు రేపు కేంద్ర బృందం రానుంది. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన AP జిల్లాల్లో పంటల్ని పరిశీలించనుంది. రెండు రోజుల పాటు నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనుంది. కేంద్ర బృందం రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొంథా తుపాను వల్ల వేల ఎకరాల్లో పంటలు కోల్పోయి రైతన్నలు తీవ్ర విషాదంలో ఉన్నారు. పంటలతోపాటు ఏయే శాఖల్లో ఎంత నష్టం జరిగిందనే దానిపై చంద్రబాబు సర్కారు ఇప్పటికే అంచనాలు తయారు చేసింది. వ్యవసాయ, ఆర్అండ్ బీ సహా పలు డిపార్ట్మెంట్లకు భారీగా నష్టం జరిగింది.