
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సరికొత్త రికార్డ్ నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్ తో సూరత్ లో జరిగిన రంజీ మ్యాచ్ లో మేఘాలయాకు చెందిన ఆకాశ్ కుమార్(Akash Kumar) చౌదరి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేశాడు. అతడు
కేవలం 11 బంతుల్లోనే రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా అది ఇంగ్లండ్ కు చెందిన వేన్ వైట్ పేరిట ఉంది. లీసెస్టర్ షైర్ తరఫున అతడు ఎసెక్స్ పై 2012లో 12 బంతులు తీసుకున్నాడు. 8వ నంబర్ ప్లేయర్ గా వచ్చి 8 సిక్సర్లు కొట్టగా, లిమర్ దాబి ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు.
అప్పటికే మేఘాలయా 576/6తో పటిష్ఠంగా ఉంది. కానీ ఆకాశ్ ఇన్నింగ్స్ తో 628/6కు డిక్లేర్ చేసింది. చివరకు అతడు 14 బంతుల్లో 50తో నాటౌట్ గా మిగిలాడు. 2019 డిసెంబరులో నాగాలాండ్ మ్యాచ్ తో అతడు రంజీల్లో అరంగేట్రం చేశాడు.