
14 ఆసుపత్రుల్లో రోజుకు సగటున 750 కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే శంకర ఐ ఫౌండేషన్ సేవలు APలో విస్తృతమయ్యాయి. గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. 1977లో ప్రారంభమైన సంస్థ ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో 30 లక్షల మందికి చికిత్సలు చేసింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో సంస్థ నడుస్తోంది. గుంటూరు బ్రాంచి ద్వారా ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి సర్జరీలు చేయగా, 9 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారని చంద్రబాబు గుర్తుచేశారు. 300 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి ఉంది.