తమిళ సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. పెద్ద హీరోల సినిమాల్ని 8 వారాల తర్వాతే OTTలో రిలీజ్ చేయాలని, టికెట్ల ఆన్ లైన్ బుకింగ్స్ పై వెబ్ సైట్ తయారీ కోసం ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించింది. OTT మోజులో సినిమాల్ని పట్టించుకోవట్లేదని, అలాంటి నటీనటుల్ని నిషేధించాలని తీర్మానించింది. లాభనష్టాల్ని నిర్మాతే భరించేవాడు. కానీ ఇక నుంచి స్టార్ హీరోలంతా పూర్తి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. ఇప్పటిదాకా లాభాలొస్తే హీరోలకు కార్లు గిఫ్టులుగా ఇచ్చేవాళ్లు. అదే నష్టపోతే నిర్మాతల్ని వారు పట్టించుకోకపోయేవారు. అయితే తాజా నిర్ణయాన్ని హీరోలు ఒప్పుకుంటారా అన్నది చూడాలి.