
శాసనసభ స్పీకర్ పై సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు KTR. పార్టీ ఫిరాయించిన MLAలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. జులై 31న సుప్రీం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయడం లేదని,
అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ కేసు లిస్టింగ్ కు రాగా.. సోమవారం విచారణ చేపడతామని CJI
బి.ఆర్.గవాయ్ అన్నారు.
కోర్టు ఆదేశాల్ని స్పీకర్ ప్రస్తావనకు తేవట్లేదని, MLAలు ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారని పిటిషనర్ గుర్తుచేశారు. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ KTR, కౌశిక్ రెడ్డి, కె.పి.వివేకానంద వేసిన పిటిషన్లపై CJI గవాయ్, జస్టిస్ ఎ.జి.మసీహ్ ధర్మాసనం ఇప్పటికే తీర్పునిచ్చింది. ఈనెల 17న సోమవారం విచారణ జరగనుండగా, ఈనెల 23న గవాయ్ రిటైరవుతారు.