
నెల్లూరు(Nellore) ఎన్టీఆర్ నగర్ వద్ద నేషనల్ హైవేపై దారుణం జరిగింది. కంటైనర్ లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యానుతోపాటు మూడు మోటార్ సైకిళ్లను
ఈడ్చుకువెళ్లి చెట్టుకు ఢీకొంది. బైకులపై ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ వల్ల మరికొందరికి గాయాలయ్యాయి. హైవేపై వ్యాపారాలు చేసుకుంటుండగా, బైకును తప్పించబోయి కంటైనర్ బీభత్సం సృష్టించింది. నెల్లూరు చుట్టూ 13 కిలోమీటర్ల పాటు జాతీయ రహదారి ఉండగా.. నిబంధనలకు విరుద్ధమైనా పొట్టకూటి కోసం రోడ్డు పక్కనే వ్యాపారాలు చేసుకుంటున్నారు.