
మొంథా తుపాను(Cyclone)తో నష్టపోయిన బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తక్షణ సాయంగా రూ.12.99 కోట్లను విడుదల చేస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఇంటికి రూ.15 వేల చొప్పున అందిస్తుండగా, 15 జిల్లాల్లో 8,662 ఇళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అక్టోబరు 27 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాలతో 16 జిల్లాల్లో నష్టం జరిగింది.
ఈ నిధుల్ని నేరుగా బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో వేస్తారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.