
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటి హేమమాలిని మీడియాపై విరుచుకుపడ్డారు. నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు రాస్తారా అంటూ మండిపడ్డారు. శ్వాస సమస్యతో ఆమె భర్త ధర్మేంద్ర(89) ముంబయి బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స కొనసాగుతుండగానే మరణించినట్లు వార్తలు వచ్చాయి. తప్పుడు వార్తలపై వారి కుమార్తె ఈషా డియోల్ వివరణిచ్చారు. ఇప్పుడు ధర్మేంద్ర ఇంటికి చేరడంతో హేమమాలిని తీవ్రస్థాయిలో స్పందించారు. ‘తప్పుడు వార్తలపై ఏం సమాధానం చెబుతారు.. ఒక వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తారా.. ఇది పూర్తి బాధ్యతారాహిత్యమైంది.. ఇలాంటి సమయంలో ఆ కుటుంబాల్ని గౌరవించడంతోపాటు స్వేచ్ఛనివ్వాలి..’ అని ట్వీట్ చేశారు.