
ఢిల్లీలో కాలుష్యం దారుణంగా మారడంతో సుప్రీంకోర్టు జడ్జి కీలక సూచన చేశారు. న్యాయవాదులు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ గా వాదనలు వినిపించాలన్నారు. కోర్టు హాలులో చాలామంది లాయర్లు
మాస్కులతోనే వాదనలు కొనసాగిస్తున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు. దీంతో వర్చువల్ గా వాదనలు జరపాలని బార్ అసోసియేషన్ కు జస్టిస్ పి.ఎస్.నరసింహ సూచించారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయికి ఢిల్లీ కాలుష్యం చేరిపోయింది. వ్యర్థాల కాల్చివేత, ఇంధన వినియోగంపై ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా మార్పు రావట్లేదు.