తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ షెడ్యూల్ రేపు విడుదల కానుంది.. ఈ నెల 15 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2026 జనవరి 3 నుంచి 31 వరకు ‘టెట్’ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ వివరాల్ని ప్రకటించింది. శుక్రవారం నాడు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలవుతుంది.