
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో మరో సంచలన విషయం బయటపడింది. AK-47తో పట్టుబడ్డ అల్-ఫలాహ్ వర్సిటీకి చెందిన మహిళా డాక్టర్ షహీన్ షహీద్.. పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్య అఫీరా బీబీతో టచ్ లో ఉంది. 2019లో 40 మంది CRPF జవాన్లను పొట్టనపెట్టుకున్న తర్వాత ఉమర్ ఎన్ కౌంటరయ్యాడు. ఇతడు జైషే-మహ్మద్ చీఫ్ అజహర్ మసూద్ కు అల్లుడు. ఆ సంస్థ మహిళా విభాగమైన జమాత్-ఉల్-మోమినత్ అడ్వైజరీ కౌన్సిల్ లో అఫీరా చేరింది. మసూద్ సోదరి సాదియా వద్ద ఉంటోంది. అలా డా.షహీన్ ఆమె ద్వారా జైషేతో సంబంధాలు నడుపుతోంది.