
జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికలో రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ రెండింటిలోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం లభించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 3,000కు పైగా ఓట్ల లీడ్ లో ఉన్నారు. తొలి రౌండ్ లో నవీన్ కు 8,926 ఓట్లు, BRS అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు వచ్చాయి. ఇక BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఫస్ట్ రౌండ్ లో నవీన్ యాదవ్ 62 ఓట్ల స్వల్ప మెజార్టీ మాత్రమే దక్కించుకున్నారు. పార్టీల వారీగా రెండో రౌండ్ వివరాలు రావాల్సి ఉంది.