
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తి కాగా, అన్నింటిలోనూ నవీన్ యాదవే ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో BRS అభ్యర్థి సునీత కొనసాగుతుండగా, BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఏడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 19,619 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్ లో స్వల్పంగా 62 ఓట్ల లీడ్ సాధించిన నవీన్ యాదవ్.. ఆ తర్వాత ఇక దూసుకుపోయారు.