
అధికారం పోయినా KTRకు అహంకారం, హరీశ్ రావుకు అసూయ పోలేదని CM రేవంత్ విమర్శించారు. అవసరమైతే రాజకీయాలు రెండేళ్ల తర్వాత చేద్దామని, కానీ అందరం అభివృద్ధి కోసం పోరాడదామన్నారు. సొంత సోషల్ మీడియాతో ఫేక్ న్యూస్ తయారు చేసి నవీన్ యాదవ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా పనిచేయలేదన్నారు. చివరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పినా వినలేదని, ఇప్పుడైనా కళ్లు తెరిచారా అని రేవంత్ ప్రశ్నించారు. ‘నువ్వు నాకంటే చిన్నోడివి.. రాజకీయాలు చేయాల్సింది బాగా ఉంది.. అహంకారం తగ్గించుకోవాలని ప్రతిపక్ష నేతకు సూచిస్తున్నా.. ఫేక్ న్యూస్ తోనే భ్రమల్లో బతకొద్దు..’ అంటూ KTRపై విమర్శలు చేశారు.