
జూబ్లీహిల్స్ విజయంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలే కాంగ్రెస్ తదుపరి టార్గెటా అన్నది తేలనుంది. ఈనెల 17న జరిగే కేబినెట్ భేటీ ద్వారా దీనికో రూపం రానుంది. అధికారం చేపట్టాక రెండు అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపొందడం హస్తం పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. ఇదే ఊపులో స్థానిక ఎన్నికలకు వెళ్తే మేలన్న భావన ఉంది. అయితే రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్తారనేదే చర్చనీయాంశంగా మారింది. BC రిజర్వేషన్ల పేరిట వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.