
చిచ్చరపిడుగులు మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. వైభవ్ సూర్యవంశీ(144; 42 బంతుల్లో 11×4, 15×6), జితేష్ శర్మ(83 నాటౌట్; 32 బంతుల్లో 8×4, 6×6) చెలరేగిపోయారు. దీంతో భారత్-A
20 ఓవర్లలో 297 పరుగుల భారీ స్కోరు చేసింది. ఏషియా కప్(Asia cup) రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో సూర్యవంశీ 32 బాల్స్ లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతడు ఔటయ్యాక జితేష్ విధ్వంసం
మొదలైంది. ఇద్దరి దాడితో UAE బౌలర్లు అల్లాడిపోయారు. రెండో వికెట్ కు 163 పరుగుల భాగస్వామ్యం నమోదైతే అందులో నమన్ ధిర్ స్కోరు కేవలం 34.