
పోలీసు(Telangana Police) శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో 60 పోస్టులకు నోటిఫికేషన్ ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) ఇచ్చింది. సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు అందులో ఉన్నాయి. ఈనెల(నవంబర్) 27 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 15 సాయంత్రం ఐదింటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్లు పంపాల్సి ఉంటుందని ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు TSLPRB వైబ్ సైట్ www.tgprb.inని సంప్రదించాల్సి ఉంటుంది.