
బిహార్ లో ముందునుంచీ నిష్పక్షపాత ఎన్నికలు జరగలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘మహాఘట్ బంధన్ పై విశ్వాసముంచిన లక్షలాది మంది బిహారీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఈ ఫలితం నిజంగా ఆశ్చర్యకరమైనది.. మొదట్నుంచీ న్యాయంగా జరగని ఎన్నికల్లో మనం విజయం సాధించలేకపోయాం.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసమే మా ఈ పోరాటం.. ఈ ఫలితాలపై కాంగ్రెస్, ఇండీ కూటమి సమీక్ష చేస్తుంది..’ అని అన్నారు. 243 స్థానాల్లో 40 కూడా దాటలేదు కాంగ్రెస్ కూటమి. NDA 202 చోట్ల, MGB 35 స్థానాల్లో విజయం సాధించాయి.