
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలకు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని(SSD) భక్తుల దర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామి వారిని 66,709 మంది దర్శించుకున్నారు. 24,053 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం శుక్రవారం నాడు రూ.4.03 కోట్లు వచ్చింది. వారాంతపు(Weekends) రోజులైన శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రతి వారాంతంలోనూ కొండ కిక్కిరిసిపోతుంది.