
రాష్ట్రీయ జనతాదళ్.. లాలూ ప్రసాద్ నడిపిన ఈ పార్టీ ఒకప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తేజస్వి నేతృత్వంలోని RJDకి ప్రస్తుతం 35 సీట్లే వచ్చాయి. ఈ లెక్కన 2030లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో ఆ పార్టీకి ఒక్క సీటూ ఉండదు. అంటే 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో సున్నా సీట్లకే పరిమితమన్నమాట.
ప్రస్తుతం ఐదుగురు సభ్యులుండగా క్రమంగా వారి పదవీకాలం పూర్తవుతుంది. కానీ దేశ రాజకీయాల్ని ఊపు ఊపిన రాష్ట్రీయ జనతాదళ్ పరిస్థితి పూర్తి దారుణంగా మారిపోయింది.