
దక్షిణాఫ్రికా(South Africa)ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్ తాను కూడా అదే రీతిలో ఆడింది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 187కే 8 వికెట్లు కోల్పోయింది. గిల్(4) రిటైర్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇక మిగిలింది అక్షర్ ఒక్కడే. జైస్వాల్(12), రాహుల్(39), సుందర్(29), పంత్(27), జురెల్(14) సఫారీల మాదిరిగానే తొందరగా వికెట్లు సమర్పించుకున్నారు. సైమన్ హార్మర్ 4, మార్కో యాన్సెన్ మూడు వికెట్లు తీసుకున్నారు. 189కి ఆలౌట్ అయిన భారత్ 30 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే సంపాదించింది. సౌతాఫ్రికా 159కి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది.