
సౌదీ అరేబియా(Saudi Arabia) బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని
ఆ దేశానికి పంపించాలని తీర్మానించింది. మంత్రి అజహరుద్దీన్ నేతృత్వంలో ఒక MIM ఎమ్మెల్యే, మైనార్టీ సీనియర్ అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తారు. మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు జరిపించేందుకు బాధిత ఒక్కో కుటుంబానికి చెందిన ఇద్దర్ని అక్కడకు తీసుకెళ్లనున్నారు. బస్సు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వారంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ ప్రకటించింది. నాలుగు ఏజెన్సీల ద్వారా మక్కాకు వెళ్లిన యాత్రికులు, అక్కడ దర్శనం కాగానే మదీనా బయల్దేరారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలున్నారు.