
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని భావించింది. సర్కారు ఏర్పడి రెండేళ్లవుతున్న సందర్భంగా వారోత్సవాలు జరపనుంది. దీంతో వచ్చే నెల 10 తర్వాతే ఎన్నికల ప్రకటన రానుంది. BC రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలకు వెళ్లాలని భావించగా, ఆ అంశం ఎటూ తేలలేదు. అధికారిక అమలు సాధ్యం కాకపోతే పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ సర్కారులో ఉంది. దీనిపై పూర్తి క్లారిటీ వచ్చాకే ఎలక్షన్లకు వెళ్తే బాగుంటుదన్న ఉద్దేశంలో ప్రభుత్వ పెద్దలున్నారు.