
జయ జయహే తెలంగాణ గేయ రచయిత దివంగత అందెశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. రాష్ట్రానికి చేసిన సేవలకు గాను ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించింది. అందెశ్రీ తనయుడు దత్తసాయికి డిగ్రీ కళాశాలల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పాఠ్య పుస్తకం మొదటి పేజీలో అందెశ్రీ గేయం ప్రచురిస్తామన్నారు. ఆయన పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని, ఆయన కుటుంబానికిచ్చే గౌరవం ఇదేనన్నారు.