
ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకే రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల గడువు మార్చితో ముగుస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. వాటిని కాపాడుకునేందుకు తొలుత పంచాయతీల ఎన్నికలు పెడతామన్నారు. పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలపై కోర్టు తీర్పు తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం వల్లే తాము రిజర్వేషన్లు అధికారికంగా కల్పించలేకపోతున్నామన్నారు.