
పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కల్యాణ్ తోపాటు BJP రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ హాలులో బాబా సమాధిని మోదీ దర్శించుకున్నారు. సాయి బంగారు విగ్రహంతోపాటు సమాధి వద్ద పూజలు చేశారు. రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరిస్తారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ సైతం పుట్టపర్తికి వచ్చారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.