
సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి వచ్చిన మోదీ.. అంతకుముందు ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని కాక ముందు సత్యసాయిని కలిసిన ఫొటోల్ని షేర్ చేశారు. సాయితో సంభాషించడానికి, ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసం ఆయన జీవితంలో చేసిన ప్రయత్నాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రధాని కొనియాడారు.