
పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మా లొంగిపోవాలని చూశాడా.! పార్టీ అగ్రనేతలంతా లొంగిపోతున్నా తాను మాత్రం పట్టవదలని రీతిలో పోరాటం చేస్తున్న ఆయన
దిగివచ్చారా.! ఈ నవంబరు 10న బస్తర్ లోని జర్నలిస్టుకు ఆయన రాసినట్లుగా భావిస్తున్న లేఖలో సంచలన విషయాలున్నాయి. ‘ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నా.. ఎక్కడ లొంగిపోవాలన్నది
నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. హిందీతోపాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ త్వరలోనే పంపుతాం.. ఆయుధాలు విడిచేముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది..’ అని అందులో ఉంది. నిన్న APలో జరిగిన ఎన్ కౌంటర్లో హిడ్మా, ఆయన భార్యతోపాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.