
పుట్టపర్తి సత్యసాయి ప్రభావం 140 దేశాలపై ఉందని ప్రధాని కొనియాడారు. పుట్టపర్తిలో బాబా శత జయంతి ఉత్సవాలకు మోదీ హాజరై స్టాంపులు, నాణేన్ని విడుదల చేశారు. ‘సేవ విషయంలో ప్రపంచానికి
మార్గదర్శకంగా సాయి నిలిచారు.. భక్తి, జ్ఞానం, కర్మ సిద్ధాంతాలు సేవపైనే ఆధారపడి ఉన్నాయి.. భారతీయ విశ్వ మూలానికి కేంద్రం సేవ.. బాబా భౌతికంగా లేకున్నా చేసిన సేవ నిలిచిపోతుంది.. ఎంతోమంది జీవితాల్ని బాబా మార్చివేశారు.. అంటూ మోదీ ప్రస్తుతించారు. సాయి సేవల్ని సచిన్, ఐశ్వర్యారాయ్, CM చంద్రబాబు కొనియాడారు. ఆయనతో కలుసుకున్న సందర్భాల్ని టెండూల్కర్ మననం చేసుకున్నారు.