
తెలంగాణ(Telangana)లో ప్రభుత్వ సేవలకు ఇకపై కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర్లేదు. 80969 58096 నంబర్ ఉంటే చాలు 38 సర్కారీ విభాగాల్లోని 580కి పైగా సేవలు అందుకోవచ్చు. 2025
నవంబర్ 18 నుంచి ఈ సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఇన్కం, బర్త్ సర్టిఫికెట్ల నుంచి విద్యుత్, వాటర్, ఆస్తి పన్ను వరకు ఎలాంటి చెల్లింపులైనా ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు. వాట్సాప్లో Hi అని టైప్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్టేటస్ కూడా చెక్ చేసుకునే వీలు కల్పించారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్కే పరిమితమైన ఈ సేవలు త్వరలోనే తెలుగు, ఉర్దూ భాషల్లో వస్తాయని ప్రభుత్వం తెలిపింది.