
వరస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో దేశంలో కుదేలైన నక్సల్ ఉద్యమం తుది అంకానికి చేరిందా? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కగార్.. పేరేదైనా 2025 ఏప్రిల్ 1 నుంచే అడవిలో అన్నలపై ఆల్అవుట్
ఆపరేషన్ ప్రారంభించాయి భద్రతా బలగాలు. లొంగిపోవడం, చచ్చిపోవడమంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ కారడవుల్లో వేటకు దిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,225మంది నక్సలైట్లు
లొంగిపోయారు. 270 మంది ప్రాణాలు కోల్పోయారు. నంబాల కేశవరావు, చలపతి, భాస్కర్ రావు వంటి ఎందరో అగ్ర కమాండర్లు నేలకొరిగారు. మల్లోజుల వేణుగోపాల్ తదితరులు అడవి వదిలి జనంలోకి వచ్చారు.
ఇప్పుడు హిడ్మా మరణంతో సుప్రీం కమాండర్ దేవ్ జీ కూడా లొంగుబాటు బాటలో ఉన్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న హోంమంత్రి అమిత్ షా ప్రకటన ముందే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.