
కొంతకాలంగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరల ఆకస్మిక హెచ్చుతగ్గులు ఒక పట్టాన కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ఈనెల 13 నుంచి 18 తేదీల మధ్య రూ.5,480 తగ్గింది. 13న రూ.1,30,960 ఉన్న 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి 18 నాటికి రూ.1,25,480కి చేరింది. అలా పడిపోతుంది అనుకునే లోపే 19 నాడు రూ.2,220 పెరిగి రూ.1,27,700కు ఎగబాకింది. ఈ ఊగిసలాటతో బంగారం కొనాలనుకునేవారు సంశయంలో పడ్డారు.పెరుగుతోందని ఆగితే తగ్గుతూ, తగ్గింది కదా అనుకుంటే పెరుగుతూ చుక్కలు చూపించడంపై నిపుణులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు.