
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలపై సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. వారికి గడువు విధించలేమని CJI నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో తేల్చిచెప్పింది. ఆమోదం, నిలిపేయడం, అసెంబ్లీకి తిప్పి పంపే 3 మినహా నాలుగో అధికారం గవర్నర్లకు లేదని తెలిపింది. కారణం చెప్పకుండా బిల్లులు వెనక్కు పంపకూడదని, ఆర్టికల్ 200 కింద విచక్షణాధికారం ఉంటుందని స్పష్టం చేసింది. 6 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ జస్టిస్ పార్దివాలా బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.
బిల్లులు సహా రాష్ట్రపతి, గవర్నర్ వద్దకు వచ్చే వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఉంటుందని గుర్తు చేసింది. అభిప్రాయం చెప్పడం మినహా ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ తలదూర్చకూడదని CJI గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ బెంచ్ తీర్పునిచ్చింది.