
చొరబాటుదారుల్ని రక్షించేందుకే ఎన్నికల సంఘం తెచ్చిన S.I.R.ను కొన్ని రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎవరి పేరు ప్రస్తావించకున్నా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించే మాట్లాడారు. S.I.R. పనికిరానిది, అత్యంత ప్రమాదకరమంటూ నిన్న ఆమె విమర్శించారు. దీనికి కౌంటర్ గానే అమిత్ షా స్పందించారు. ఈ విధానంతో బిహార్ లో 68 లక్షల నకిలీ ఓట్లు తొలగించగా, మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని EC ఇప్పటికే ప్రకటించింది. త్వరలోనే ఎన్నికలు జరిగే బెంగాల్ పై ఇప్పుడు BJP-తృణమూల్ దృష్టిపెట్టాయి.