రాష్ట్రంలో మరో మూడు రోజుల(Three Days) పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు(Heavy Rains) ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి రేపు పొద్దున వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇక రేపు పొద్దున్నుంచి ఎల్లుండి ఉదయం వరకు మరో 7 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ఇష్యూ అయింది. అందులో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఇందులో ఉన్నాయి.
ఈ రోజు నుంచి రేపు పొద్దున వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండటంతో 17 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ అయింది. ఇంచుమించు రాష్ట్రవ్యాప్తంగా ఒకట్రెండు జిల్లాలు మినహాయిస్తే అన్ని చోట్లా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం(IMD) స్పష్టం చేసింది.