
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో వాయిదా వేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశముంది. ఎన్నికల్ని సకాలంలో నిర్వహించాలని గతంలో పిటిషన్ దాఖలైంది. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం గడువు కోరగా, రిజర్వేషన్లు తేలితే ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. తొలుత పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడ్డ సర్కారు.. రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా మొన్న జీవో ఇచ్చింది. ఈ విషయాన్ని ఇప్పుడు జరిగే విచారణలో కోర్టుకు తెలిపే అవకాశముంది.