రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను జలగం వెంకట్రావు కలిశారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని అందజేశారు. కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని వికాస్ రాజ్ కు అందించారు. తనను కొత్తగూడెం MLAగా గుర్తించాలని కోరారు. వనమాపై అనర్హత వేటు వేసి ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. జలగం వెంకట్రావును కొత్తగూడెం MLAగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వనమా ఎన్నికపై మాజీ MLA అయిన జలగం 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
సుదీర్ఘ విచారణ అనంతరం జులై 25న వనమా ఎన్నికను తోసిపుచ్చింది. 2018 ఎలక్షన్ అఫిడవిట్ లో వనమా వెంకటేశ్వర్ రావు అవినీతికి పాల్పడినట్లుగా నిర్ధారించింది. ఎన్నికను రద్దు చేసి జలగం వెంకట్రావును MLAగా ప్రకటించి, వనమా వెంకటేశ్వర్ రావుకు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పు కాపీలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వెంకట్రావు అందజేశారు.