మూడోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో థర్డ్ ప్లేస్ మనదే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కలలు, ఆలోచనలు, చేసే పని ఉన్నతంగా ఉన్నప్పుడు ఇది సాధ్యమేనని స్పష్టం చేశారు. కార్గిల్ పోరులో ప్రాణాలర్పించిన యుద్ధవీరులకు ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో నివాళులర్పించిన PM.. వారి సేవలు జాతి సంపదగా గుర్తు చేసుకున్నారు.
అంతకుముందు ఆయన ‘ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్(IECC)ని ప్రారంభించి దానికి ‘భారత్ మండపం’ అని పేరు పెట్టారు. నేషనల్ ప్రాజెక్ట్ లో భాగంగా రూ.2,700 కోట్లతో 123 ఎకరాల్లో ఈ IECCని నిర్మించారు. ఈ IECC ఓపెనింగ్ కు గెస్ట్ లుగా మంత్రులు, వివిధ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు 3,000 మంది అటెండ్ అయ్యారు. మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(MICE) నిర్వహణకు ఇది యూజ్ అవుతుంది. ప్రపంచంలోనే టాప్-10 ఎగ్జిబిషన్ సెంటర్ గా దీన్ని తీర్చిదిద్దారు.
‘కర్తవ్య పథం దిశగా సాగుతున్నప్పుడు కొందరు మనల్ని ఆపడానికి కుయుక్తులు పన్నుతారు.. మంచి పనులు ఆపడానికి కోర్టులను వెన్యూగా చేసుకుంటారు.. అలాంటి వారు సైతం ఈ భారత్ మండపాన్ని యాక్సెప్ట్ చేస్తారు.. ఇక్కడకు వచ్చి సెమినార్లలో కూడా పాల్గొంటారు’ అంటూ అపోజిషన్ పార్టీలను ఉద్దేశించి మోదీ చురకలంటించారు.