రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న వానలు పల్లె ప్రాంతాల్లో(Villages) భయాందోళనలు సృష్టిస్తోంది. నిన్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదై చెరువులు తెగిపోగా.. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా(Highest) 29.2 సెంటీమీటర్ల వర్షపాతం(Rainfall) రికార్డయింది. అదే జిల్లా కొత్తగూడెం మండలం ఓల్డ్ కొత్తగూడెంలో 21.7 సెంటీమీటర్లు.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 19 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ రికార్డయింది.
హైదరాబాద్ కు వార్నింగ్
హైదరాబాద్ లో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం వరకు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అలర్ట్ గా ఉండాలంటూ GHMCకి సూచించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, ప్యాట్నీ, బేగంపేట, ప్యారడైజ్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది.