
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ ‘బ్రో’. సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందే ఓవర్సీస్ లో హంగామా సృష్టిస్తోంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ నెల 28న రిలీజ్ కానుండగా ప్రీమియర్ షో కలెక్షన్లలో దండిగా వసూలు చేస్తోంది. ఓవర్సీస్ లో ‘బ్రో’ మేనియా స్పష్టం కనిపిస్తోంది.
మంగళవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. హీరో సాయిధరమ్ తేజ్ కు జంటగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. సముద్రఖని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.
అమెరికాలోని 230 లొకేషన్స్ లో ‘బ్రో’ మూవీ 710 ప్రీమియర్ షోలుగా ప్రదర్శించనున్నారు. దీనికోసం ఇప్పటికే 2.5 కోట్లు, UKలోని 55 లొకేషన్స్ లో 87 ప్రీమియర్స్ కు కలిపి రూ.కోటి, ఆస్ట్రేలియాలో 27 లొకేషన్లలో 46 ప్రీమియర్ షోలకు రూ.20 లక్షలు, కెనడాలో 6 లొకేషన్స్ లో 22 ప్రీమియర్ షోలకు కలిపి రూ.17 లక్షలు వసూలు చేసింది. అయితే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోసే ఈ రేంజ్ లో వసూల్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.