భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నందున రేపు కూడా విద్యా సంస్థలు బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెలవుపై ఆర్డర్స్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలతో కాలు బయట పెట్టలేని వాతావరణం ఉంది. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో సెలవు కంటిన్యూ చేయాలని CM ఆదేశించారు.