
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యుటీ లీడర్ పదవి నుంచి తొలగించాలని, సభలో ఆప్ తరఫున మాట్లాడే అవకాశమివ్వొద్దని ఎగువసభ కార్యదర్శికి లేఖ రాసింది. ఆ పార్టీకి పంజాబ్ నుంచి ఏడుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యులున్నారు. 2012 నుంచి కేజ్రీవాల్ తో పనిచేస్తున్నారు. 2022లో రాజ్యసభకు ఎంపికై 33 ఏళ్ల వయసులోనే ఆ ఘనత సాధించగా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన రాఘవ్ చద్దా ఆప్ లో కీలక పదవులు అందుకున్నారు. 2019లో లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోగా, 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి గెలిచారు.