
ఎంపీ రాఘవ్ ఛద్దాను ఆప్ దూరం పెట్టడానికి పలు కారణాలున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఛద్దా ఆలస్యంగా స్పందించారు. లండన్ లో కంటి ఆపరేషన్ చేయించుకున్నారని తేలినా, పార్టీతో దూరంగా ఉంటున్నారు. కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుండి ఆయన ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలైనా స్పందించలేదు. నిర్దోషిగా కోర్టు ప్రకటించాక కేజ్రీవాల్ తో అంతా మీటింగ్ పెడితే దానికీ డుమ్మా కొట్టారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలన్న తీర్మానంపై 193 మంది విపక్షాల ఎంపీలు సంతకాలు పెడితే ఆయనసలు సంతకమే పెట్టలేదు. 2012 నుంచి కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న రాఘవ్ ఛద్దా ఇప్పటికీ 12 మంది రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగానే ఉన్నారు. కానీ ఆయన తీరుతో ఆగ్రహంగా ఉన్న పెద్దలు కీలక బాధ్యతల నుంచి దూరం పెట్టారు.