
పౌర అణుశక్తిలో భారత్ గొప్ప ముందడుగేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యంత అధునాతన ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్(PFBR) క్రిటికాలిటీని చేరుకుంది. పూర్తి సామర్థ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేలా నిరంతర అణువిచ్ఛిత్తి జరపడాన్ని క్రిటికాలిటీగా పిలుస్తారు. తమిళనాడులోని కల్పకంలో 500 మెగావాట్ల విద్యుత్ సోడియం-శీతలీకరణ గల PFBR నిర్మాణానికి 20 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఇది అత్యంత సంక్లిష్టమైన ఇంజినీరింగ్ ప్రక్రియ కాగా శాస్త్రవేత్తలు దాన్ని విజయవంతం చేశారు. తక్కువ కార్బన్, స్వచ్ఛమైన ఇంధన వనరుల దిశగా 2047 నాటికి అణువిద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఒకసారి ఈ కేంద్రం పూర్తి పనిచేయడం ప్రారంభించాక వాణిజ్యపరమైన సాధ్యాసాధ్యాలపై సర్కారు దృష్టిపెడుతుంది. ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో 22-25 రియాక్టర్లు 6780-8780 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నాయి. అందులో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్, లైట్ వాటర్ రియాక్టర్లున్నాయి. 15,300 మెగావాట్లు గల 21 కొత్త రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. 2030-31 నాటికి 21,980కి, 2047 నాటికి లక్ష మెగావాట్ల(100 గిగావాట్లకు)కు పెంచడమే లక్ష్యం. సొంత థోరియం నిల్వలతోనే ప్రక్రియ నడుస్తోంది.ఈ ఘనతకు కారకులైన ప్రతి ఒక్కర్నీ ప్రధాని మోదీ అభినందించారు.
ను మోదీ అభినందించారు.