
బెంగాల్ ఓటరు జాబితా ప్రక్షాళనలో పేర్లు తొలగించబడ్డ వ్యక్తులకు ఓటు హక్కు కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 16 లక్షల అప్పీళ్లు దాఖలు కాగా, సుప్రీం ఆదేశాలు మమత సర్కారును ఇరకాటంలో పడేశాయి. తొలగింపునకు గురైన వారందరికీ ఈనెల చివర్లో జరగనున్న రెండు దశలో ఎన్నికల్లో ఓట్లు కల్పించాలని తృణమూల్ నేత కల్యాణ్ బెనర్జీ కోరారు. ‘అది కుదరని పని.. మేం దృష్టిపెడితే సంబంధిత వ్యక్తుల ఓటు హక్కుల్నే రద్దు చేస్తాం..’ అని సీజేఐ సూర్యకాంత్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
బెంగాల్ ఓటర్ల జాబితాను సుప్రీం స్తంభింపజేయగా, సుప్రీంకోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇస్తే తప్ప ఏ కొత్త పేరునూ చేర్చడానికి వీలు లేదు. తమ పేర్లను తొలగించడంపై 13 మంది వ్యక్తుల బృందం సుప్రీం జోక్యం కోరిన పిటిషన్ పై ఘాటైన ఆదేశాలు వెలువరించింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 27 లక్షల కేసుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి 19 అప్పిలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు.