మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజైంది. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా, కీర్తి సురేశ్ లు ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించి ట్రైలర్ ను గురువారం సాయంత్రం రామ్ చరణ్ విడుదల చేశారు.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. తనదైన గ్రేస్, స్టైల్‌తో డాన్స్ ఇరగదీశారు చిరు. స్టైలిష్‌గా కనిపిస్తూనే మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆశ్చర్యపరిచారు మెగాస్టార్. AK ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, K.S.రామారావు జాయింట్ గా నిర్మించిన ఈ ‘భోళా శంకర్’ చిత్రం మరో 15 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది.
కోల్ కతా బ్రాక్ గ్రౌండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన అజిత్ మూవీ ‘వేదాళం’కు రీమేక్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది.