శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP)కు భారీగా వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఫ్లడ్ వాటర్ పోటెత్తుతోంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ లోకి 3,08,000 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా అన్నట్లు డ్యాం అధికారులు నీటిని వదులుతున్నారు. 32 గేట్లు తెరిచి 3,00,000 క్యూసెక్కుల్ని గోదావరి నదిలోకి వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కుల్ని రిలీజ్ చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా పూర్తిస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1089 అడుగుల మేర నిల్వ ఉంది. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 90 TMCలకు గాను ప్రస్తుతం 78.661 TMCలుగా ఉంది.