గోదావరి, కృష్ణా నదులకు వరద కంటిన్యూ అవుతోంది. గోదావరి బేసిన్(Basin) ను పరిశీలిస్తే….
@ సింగూరు ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 29.91 TMCలకు గాను ప్రస్తుతం 23.69 TMCలు ఉంది. ఇన్ ఫ్లో 16,030 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 385 క్యూసెక్కులు మాత్రమే ఉంది.
@ నిజాంసాగర్ ఫుల్ లెవెల్ 17.803 TMCలకు గాను ప్రెజెంట్ 17.022 TMCల నిల్వ ఉంది. 41,044 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 10,830 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
@ SRSPకి వస్తున్న హెవీ ఫ్లడ్ కంటిన్యూ అవుతోంది. 90.313 TMCల గరిష్ఠ సామర్థ్యానికి గాను 78.661 TMCల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2,33,504 క్యూసెక్కులు వస్తుండగా.. 1,70,612 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
@ LMD గరిష్ఠ నీటిమట్టం 24.07 TMCలకు గాను 22.165 TMCల స్టోరేజ్ ఉంది. 1,15,456 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 26,421 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
@ కడెం ప్రాజెక్టుకు 1,42,298 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 1,77,754 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఫుల్ కెపాసిటీ 7.6 LMD TMCలకు గాను ప్రస్తుతం 4.487 TMCల నిల్వ ఉంది.
కృష్ణా బేసిన్లోనూ ఇన్ ఫ్లో
@ 129.72 TMCల గ్రాస్ స్టోరేజ్ గల ఆల్మట్టిలో ప్రస్తుతం 91.9 TMCలు స్టోరేజ్ చేస్తున్నారు. 1,57,729 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 1,65,102 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
@ నారాయణపూర్ లో గరిష్ఠ నీటిమట్టం 37.64 TMCలు కాగా ఇప్పుడు 30.93 TMCలు ఉంది. 1,55,297 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 1,25,714 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నడుస్తోంది.
@ కృష్ణానదిపై మన రాష్ట్రంలోని ఫస్ట్ ప్రాజెక్టు జూరాలకు 33,540 క్యూసెక్కులు వస్తుండగా, 61,873 క్యూసెక్కుల్ని వదులుతున్నారు. గ్రాస్ స్టోరేజ్ 9.66 TMCలకు గాను ప్రస్తుతం 6.786 TMCల నిల్వ ఉంది.
@ తుంగభద్ర డ్యాంకు 1,07,118 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 59 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. పూర్తి నీటిమట్టం 105.79 TMCలకు గాను 59 TMCల స్టోరేజ్ ఉంది.
@ శ్రీశైలం ప్రాజెక్టుకు 45,893 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 51 క్యూసెక్కుల ఔట్ ఫ్లో మాత్రమే ఉంది. పూర్తి సామర్థ్యం 215.807 TMCలకు గాను 42.0842 TMCలు ఉంది.
@ నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 312.045 TMCలకు గాను 141.198 TMCల నిల్వ ఉంది. 6,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 10,390 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంటోంది.