వరదలు తలెత్తిన ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరద బాధితుల సహాయ చర్యలపై రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫ్లడ్ వల్ల ఎందరు ప్రాణాలు కోల్పోయారు.. బాధితులకు పరిహారం చెల్లించారా.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సేఫ్ ప్లేసెస్ కు షిఫ్ట్ చేశారా.. రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎలాంటి సదుపాయాలు కల్పించారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా అంటూ వీటన్నింటిపై ఈ నెల 31 వరకు పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో వరద సహాయక చర్యల తీరుపై నల్గొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పరిసరాల్లోని ప్రజలు భయం భయంగా కాలం గడుపుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టు జోక్యం చేసుకున్న న్యాయస్థానం ‘డ్యామ్ సేఫ్టీ యాక్ట్’కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.